కొన్నాళ్ళ క్రితమే కుర్ర హీరో ఆది, అదేనండి మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి అబ్బాయి అరుణ అనే రాజమండ్రి అమ్మాయిని వివాహమాడి ఓ ఇంటివాడయ్యాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ కళ్యాణ మహోత్సవానికి సాయి కుమార్ గారు దగ్గరుండి మరీ దక్షిణ భారత చలన చిత్ర అతిరథమహారథులందరి దీవెనలు కొత్త జంటకి అందేలా చేసారు. సంతోషంగా సాగుతున్న వారి సంసారంలో మరింత ఆనందం కలిగించే వార్త ఇదిగో. ఆది ఈరోజు సాయంత్రం తండ్రిగా ప్రమోషన్ కొట్టేసాడు. అవును, అరుణ గారు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు. పాపాయి, తల్లి ఇద్దరూ క్షేమమే. సాయి కుమార్ కుటుంబం మొత్తం ప్రస్తుతం రాజమండ్రిలోనే ఉన్నారు. ఆది కొత్త సినిమా గరం కూడా తొందరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కంగ్రాట్స్ టు ఆది అండ్ అరుణ.