Advertisementt

రవితేజకు అంత దమ్ము లేదా?

Thu 17th Dec 2015 05:40 PM
raviteja,dil raju,yevdo okkadu  రవితేజకు అంత దమ్ము లేదా?
రవితేజకు అంత దమ్ము లేదా?
Advertisement
Ads by CJ

బెంగాల్ టైగర్ సినిమా మనం అనుకున్న స్థాయికి అటూ ఇటుగా వాణిజ్య విజయం సాధించిన దాని కిందే లెక్కేసుకోవచ్చు. కిక్ 2లాంటి మహా ఫెయిల్యూర్ తరువాత రవితేజ నుండి మళ్ళీ చక్కటి వినోదాత్మకమైన చిత్రం ఆశించిన వాళ్ళందరినీ బెంగాల్ టైగర్ తృప్తి పరచగలిగింది. ఫస్ట్ హాఫుతో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ పైన కొన్ని నెగెటివ్ కామెంట్స్ పడడంతో ముప్పై కోట్ల మార్కును అధిగమించుతుంది అనుకున్న మాస్ మహారాజా అభిమానులకు బెంగాల్ టైగర్ కొంత నిరాశనే  మిగిల్చింది. అంటే మాస్ రాజా ఇమేజి మీద సినిమా మొత్తం లాక్కురావాలనుకున్న సంపత్ నంది  పాచిక పెద్దగా పారలేదు. ఎంటర్ టైన్మెంట్ డామినేట్ చేసే పాత్రలోనే రవితేజను ఎంజాయ్ చేసారు తప్ప సాలిడ్ కంటెంట్ వేస్తే హెవీనెస్ భరించలేక పోయారు. దీనర్థం ఒక్కటే. కిక్ లాంటి కిక్ యాస్ కథ అయితేనే తప్ప రవితో బంపర్ హిట్ కొట్టడం అసాధ్యం అని తేలిపోయింది. కనుకనే రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడో ఒక్కడు సినిమా షూటింగ్ మొదలవకుండానే వాయిదా పడింది. ఫస్ట్ హాఫ్ ట్రీట్మెంట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ సైన్ చేసిన రవికి ఇప్పుడు సెకండ్ హాఫ్ మీద నమ్మకం కుదరడం లేదంట. ఒక్కటే హాఫ్ మీద ఆధారపడితే రవితేజకు బాక్సాఫీసును లాక్కొచ్చే సత్తా లేదని తెలుసుకున్న దిల్ రాజు సైతం కథను మరింత పదును పెట్టడానికి డిసెంబర్ నుండి ఫిబ్రవరీ వరకు షూటింగ్ పోస్ట్ పోన్ చేయించాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ