Advertisementt

వ్యాపారం కోసమే నాగార్జున అలా చేసాడు!

Wed 16th Dec 2015 05:51 PM
soggade chinni nayana,pre release business,nagarjuna  వ్యాపారం కోసమే నాగార్జున అలా చేసాడు!
వ్యాపారం కోసమే నాగార్జున అలా చేసాడు!
Advertisement
Ads by CJ

ఎటువంటి ముందస్తు సూచన లేకుండా అక్కినేని నాగార్జున కొత్త చిత్రం సోగ్గాడే చిన్ని నాయన ట్రైలర్ మొన్న విడుదల చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అనుకోని సర్ ప్రైజ్ రావడంతో అక్కినేని అభిమానులు తెగ మురిసిపోయారు. ట్రైలర్లో కూడా విషయం ఉండడంతో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంకొద్దిమంది అయితే సంక్రాంతికి సోగ్గాడు రావడం ఖాయం అన్నట్టుగా ప్రచారం కూడా సాగించేసి బాలకృష్ణ డిక్టేటర్ చిత్రానికి చాలెంజ్ వదిలారు. తీరా ఇన్నర్ విషయం కనుక్కుంటే సోగాడే పట్ల గతకొద్ది రోజులుగా రీ-షూటింగ్ న్యూస్ మీద బ్యాడ్ పబ్లిసిటీ జరిగి ఉంది. అందుకే నాగార్జునకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి బిజినెస్ కాల్స్ రాలేదు. మళ్ళీ జనానికి, ట్రేడ్ వర్గాలకు పాజిటివ్ బజ్ ఇవ్వడానికే కొత్త ట్రైలర్ వదిలారు. వీళ్ళు అనుకున్న పాచిక బాగానే పారింది. కొత్త దర్శకుడు కళ్యాన్ కృష్ణ పట్ల కూడా కొంత డ్యామేజ్ కంట్రోల్ అయింది. ఇప్పటికైతే సోగ్గాడే కోసం కొన్ని ఏరియాల వారు అడ్వాన్సులు అట్టుకొని హైదరాబాద్ బయల్దేరేందుకు  సిద్ధం ఉన్నారట.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ