Advertisementt

హాలివుడ్ నుండి బాలివుడ్ చేరిన రోబో 2

Mon 14th Dec 2015 04:21 PM
neil nithin mukesh,robot 2,arnold schwargenegger,shankar,rajinikanth  హాలివుడ్ నుండి బాలివుడ్ చేరిన రోబో 2
హాలివుడ్ నుండి బాలివుడ్ చేరిన రోబో 2
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తీయబోతున్న రోబో 2 స్థాయి ఓ మెట్టు కిందకి దిగింది. రజిని, శంకర్ కలయిక అంటే చాలు ఆటోమేటిగ్గా విపరీతమైన హైప్ వచ్చేస్తుంది. అలాగని శంకర్ ఊరుకున్నాడా లేదే, హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్నాడని ఒక్కసారిగా సినిమా స్థాయిని ఇండియా నుండి ఇంటర్ నేషనల్ లెవెల్ వరకు లేపుకుపోయాడు. దీనికి తోడు అయిదు వందల కోట్ల బడ్జెట్ అన్న వార్త కూడా సర్వత్రా వ్యాపించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం రోబో 2 నుండి ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ సెలవు తీసుకున్నాడని, ఆయన స్థానే బాలివుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ప్రతినాయకుడి పాత్రలో కనపడనున్నాడని టాక్. మరి లైకా ప్రొడక్షన్ సంస్థ రోబో 2ని అంతర్జాతీయ యవనిక పైన ఎలా నిలబెడుతుందో, రజిని అన్న ఒక్క పేరును వాడుకుని ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఆర్నాల్డ్ ఎగ్జిట్ వాళ్ళ జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుతారో. ప్రస్తుతానికయితే రోబో 2 రేంజు హాలివుడ్ నుండి బాలివుడ్ దగ్గరికి పడిపోయింది.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ