Advertisementt

నాగార్జునకి దిష్టి చుక్క పెట్టాల్సిందే!

Sat 12th Dec 2015 11:52 PM
nagarjuna,soggade chinni nayana trailer  నాగార్జునకి దిష్టి చుక్క పెట్టాల్సిందే!
నాగార్జునకి దిష్టి చుక్క పెట్టాల్సిందే!
Advertisement
Ads by CJ

వయసుతో సంబంధం లేకుండా పుట్టక ముందే దేవుడి దగ్గర నిత్య యవ్వనాన్ని వరంగా అడిగి తెచ్చుకున్న అక్కినేని నాగార్జునకు లేడీస్ ఫాలోయింగు ఎందుకు ఎక్కువంటారో మనకు తెలియనిది కాదు. సినిమాలు ఎలాగున్నా నాగార్జున లుక్కుకి మాత్రం కిక్కెక్కని ఆడంగులు ఉండరు. ఈ మధ్య కొడుకుల కోసమేమో మరి కొద్దిగా జోరు తగ్గించిన నాగార్జున మళ్ళీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన పేరుతో సంక్రాంతికి మన ముందుకు రావడానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నాడు. కళ్యాణ్ కృష్ణ అనే కొత్త దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తాలూకు కొత్త ట్రైలర్ కాసేపటి ముందే విడుదలైంది. రమ్య కృష్ణ, లావణ్య త్రిపాటి, హంసా నందిని లాంటి హాట్ హాట్ భామలతో మన మన్మధుడు జరిపిన శృంగార భరిత హాస్యం ఈ ట్రైలర్లో సూపరుగా వర్క్ అవుట్ అయింది. స్లో మోషన్ షాట్లలో నాగార్జున మరింత అందంగా కనిపించారు. కేవలం నాగార్జున మీదే దృష్టి కేంద్రీకరించకుండా దర్శకుడు ఈ ట్రైలర్లో కథలోని కొంత సస్పెన్సు భాగాన్ని కూడా ప్రేక్షకులకు రుచి చూపడం ఓ చక్కటి ఎత్తుగడ. రొటీన్ సినిమాలా కాకుండా ఈ సోగ్గాడు ఏదో కొత్త విషయాన్ని తీసుకురాబోతున్నాడని అర్థమయింది. ట్రైలర్ పిటపిటలాడి పోయింది, నాగార్జునకి దిష్టి చుక్క పెట్టండి బాబులూ... 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ