Advertisementt

వామ్మో ఏంటిది రవితేజా...?

Sat 12th Dec 2015 03:40 PM
raviteja,bengal tiger,sampath nandi  వామ్మో ఏంటిది రవితేజా...?
వామ్మో ఏంటిది రవితేజా...?
Advertisement
Ads by CJ

కుమారి 21 F, రాజు గారి గది లాంటి చిన్న సినిమాల విజయాలు... అఖిల్, బ్రూస్ లీ, కిక్ 2 లాంటి పెద్ద చిత్రాల అపజయాల నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలకు, బడా హీరోల ప్రాజెక్టులకు కథాబలం లేకపోతే కాలం చెల్లిందన్న పాయింట్ పరిశ్రమలో గట్టిగా నాటుకుపోయింది. ప్రస్తుతం ఉన్న వేవ్ ప్రకారం మాస్, కమర్షియల్ సినిమాలంటేనే అటు బయ్యర్లు, ఇటు జనాలు పారిపోయే వాతావరణం తయారయింది. అందుకే రవితేజ బెంగాల్ టైగర్ పట్ల కూడా రిలీజుకి ముందర కొందరికి ఎక్కడో చిన్న అనుమానం ఉండిపోయింది. బట్, విడుదలైన మొదటి షోతోనే రవితేజ స్టామినాను మరో మెట్టు పైకి ఎక్కించే సినిమా ఇది అన్న నిజాన్ని ట్రేడ్ వర్గాలు మొత్తం జీర్నించేసుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే కిక్ 2 ఫ్లాప్ తాలూకు చాయలు ఎక్కడా పడకుండా జాగ్రత్తపడ్డ నిర్మాత రాధా మోహన్, దర్శకుడు సంపత్ నంది కష్టం ఫలించింది. బెంగాల్ టైగర్ మొదటి రోజు వసూళ్లు 6.5 కోట్లు అంటున్నారంటే, రెండో రోజు కూడా అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ రిపోర్ట్స్ నమోదయ్యాయంటే ఓ చక్కటి మాస్ సినిమాకు, ఓ స్టార్ పవర్ తోడయితే ఎటువంటి వండర్స్ క్రియేట్ చెయ్యవచ్చో సంపత్ నంది నిరూపించి చూపారు. అటు రచ్చతో రామ్ చరణ్ కష్టాలు తీర్చిన సంపత్, ఈసారి రవితేజ కెరీరుకు బెంగాల్ టైగర్ అంటూ అసలు సిసలైన ఎనర్జీని అందించాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ