Advertisementt

బన్నీ స్క్రిప్ట్ తో రామ్..?

Thu 10th Dec 2015 06:43 PM
ram,kandireega,santhosh srinivas,thikkaregithe movie,nenu sailaja  బన్నీ స్క్రిప్ట్ తో రామ్..?
బన్నీ స్క్రిప్ట్ తో రామ్..?
Advertisement
Ads by CJ

గతంలో అల్లు అర్జున్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 'తిక్కరేగితే' అనే సినిమా వస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాని సంతోష్ డైరెక్ట్ చేసిన 'రభస' చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడంతో బన్నీ, సంతోష్ ను పక్కన పెట్టేసాడు. అయితే తాజాగా ఈ స్క్రిప్ట్ ను హీరో రామ్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. 'శివమ్' సినిమా రిజల్ట్ తో నిరాశ చెందిన రామ్ ఎలాగైనా.. హిట్ కొట్టాలనే కసితో సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథను ఓకే చేసాడట. గతంలో సంతోష్ శ్రీనివాస్, రామ్ కలిసి పనిచేసిన 'కందిరీగ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో.. చూడాలి. ప్రస్తుతం రామ్ నటించిన 'నేను శైలజ' చిత్రం జనవరి 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత రామ్, సంతోష్ చెప్పిన ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నాడు. మొదట అనుకున్నట్లుగానే 'తిక్కరేగితే' టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ