Advertisementt

పూరీపై మండిపడుతోన్న మెగాఫ్యాన్స్‌..!

Thu 10th Dec 2015 04:30 PM
bengal tiger movie,loafer audio,varun tej,ram gopal varma,puri jagannath  పూరీపై మండిపడుతోన్న మెగాఫ్యాన్స్‌..!
పూరీపై మండిపడుతోన్న మెగాఫ్యాన్స్‌..!
Advertisement
Ads by CJ

పూరీజగన్నాథ్‌ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌కు శత్రువుగా మారాడనే వార్త ఇండస్ట్రీతో పాటు సోషల్‌మీడియాలోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా జరిగిన 'లోఫర్‌' ఆడియో ఫంక్షన్‌కు పూరీ చిరంజీవితో పాటు మిగిలిన మెగాహీరోలను పిలవకపోవడంతో పాటు మెగాఫ్యాన్స్‌ శత్రువుగా భావిస్తున్న రామ్‌గోపాల్‌వర్మను ఆహ్వానించడం మరొక కారణం అంటున్నారు. దానికితోడు ఫంక్షన్‌ అనంతరం వర్మ చేసిన ట్వీట్స్‌తో మెగాఫ్యాన్స్‌ మరింత మండిపడుతున్నారు. వర్మ తన ట్టిట్టర్‌ ద్వారా.. మెగా ట్రీ నుండి ఎలక్ట్రిక్‌ పవర్‌ను తీసుకోకుండా, తన స్వంత సోలార్‌ బ్యాటరీ ద్వారా వరుణ్‌తేజ్‌ రావడం నాకు నచ్చింది. వరుణ్‌తేజ్‌ చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే వ్యక్తి కాదు. చెట్టుకు గౌరవం ఇస్తాడు గానీ కొమ్మలాగా బతకడం కోరుకోడని వర్మ చేసిన ట్వీట్స్‌ ఇప్పుడు అందరిలో చిచ్చును రేపుతున్నాయి. మెగా కాంపౌండ్‌కు చెందిన హీరో ఆడియో వేడుకకు వచ్చి వర్మ ఇలా కామెంట్స్‌ చేయడం దారణమని, అసలు వర్మను కావాలని పూరీ ఇన్‌వైట్‌ చేసినప్పుడే ఇదంతా ఓ ప్లాన్‌ ప్రకారం జరుగుతోందనే అనుమానం తమకు వచ్చిందని మెగాఫ్యాన్స్‌ అభ్యంతరం తెలుపుతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ