Advertisementt

నాగ్‌ రెడీ అవుతున్నాడు..!

Thu 10th Dec 2015 12:34 PM
nagarjuna,soggade chinni nayana movie,nagarjuna dual role,kalyan krishna  నాగ్‌ రెడీ అవుతున్నాడు..!
నాగ్‌ రెడీ అవుతున్నాడు..!
Advertisement
Ads by CJ

నాగార్జున చాలాకాలం తర్వాత ద్విపాత్రాభినయం పోషిస్తోన్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొడుకుకు మాత్రమే కనిపించే తండ్రి ఆత్మగా పెద్ద నాగార్జున కనిపించునున్నాడు. కాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ బేనర్‌లో స్వయంగా నాగ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్‌కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. కాగా ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్‌ అందించిన సంగీతం హైలైట్‌ అవుతుందని యూనిట్‌ బావిస్తోంది. కాగా ఈచిత్రం ఆడియో వేడుకను డిసెంబర్‌27న జరపాలని, చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ