Advertisementt
CJ Ads

ఆడియో వేడుకల సీజన్‌ స్టార్ట్ !

Wed 09th Dec 2015 05:51 PM
audio functions,top movies,nannaku prematho,soukyam,dictator,nenu sailaja,loafer  ఆడియో వేడుకల సీజన్‌ స్టార్ట్ !
ఆడియో వేడుకల సీజన్‌ స్టార్ట్ !
Advertisement
Ads by CJ

ఈ డిసెంబర్‌ నెలంతా వరుసగా ఆడియో ఫంక్షన్స్‌ కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రిస్మస్‌, సంక్రాంతి సీజన్‌లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల ఆడియో వేడుకలు ఇప్పటివరకు జరగలేదు. ఆయా సినిమాల పాటల కోసం శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల పూరీ-వరుణ్‌తేజ్‌ల 'లోఫర్‌' ఆడియో వేడుక జరిగింది. ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించాడు. ఇక అక్కడ నుండి దాదాపు నెలలో ప్రతివారం ఏదో ఒక పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్ హడావుడి ఉంది. రామ్‌ హీరోగా నటిస్తున్న 'నేను శైలజ' చిత్రం ఆడియో డిసెంబర్‌ 12న జరుగనుంది. ఆ మరుసటి రోజే గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న 'సౌఖ్యం' ఆడియో డిసెంబర్‌ 13న ఒంగోలులో జరుగనుంది. డిసెంబర్‌ 20న బాలకృష్ణ 'డిక్టేటర్‌' ఆడియో ఆంద్రప్రదేశ్‌ నూతనరాజధాని అమరావతిలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇక ఎన్టీఆర్‌ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఆడియో ఈనెల 23న లేదా 25న విడుదలకు సిద్దమవుతోంది. ఇక సంగీత, సాహిత్య ప్రియులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ