సునీల్‌ 'జక్కన్న' కు ఫిక్సయ్యాడు!

Mon 07th Dec 2015 03:56 PM
sunil,jakkanna,sunil new movie jakkanna,vamsi krishna aakella,sunil new movie  సునీల్‌ 'జక్కన్న' కు ఫిక్సయ్యాడు!
సునీల్‌ 'జక్కన్న' కు ఫిక్సయ్యాడు!
Sponsored links

తెలుగు సినిమా పరిశ్రమ గురించి తెలిసిన వారెవ్వరైనా.. జక్కన్న ఎవరంటే ఠక్కున్న దర్శకదీరుడు రాజమౌళి పేరు చెబుతారు. అపజయాలు ఎరుగని దర్శకుడిగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా పర్‌ఫెక్ట్‌గా సినిమాలను, అందులోని పాత్రలను చక్కగా శిల్పిలాగా చెక్కుతాడు కాబట్టే జూనియర్‌ ఎన్టీఆర్‌.. రాజమౌళిని జక్కన్న అంటూ పిలిచేవాడు. రాను రాను అదే పేరు రాజమౌళికి నిక్‌నేమ్‌గా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం వరుస ఫ్లాప్‌లలో ఉన్న హీరో సునీల్‌ ఈసారి ఏకంగా ఈ జక్కన్నను తన సినిమాకు బాగా వాడుకొని క్రేజ్‌ తేవాలని డిసైడ్‌ అయినట్లు కనిపిస్తున్నాడు. 'జక్కన్న' పేరైతే తన సినిమా తొందరగా అందరికీ రీచ్‌ అవుతుందని భావించిన సునీల్‌ తాను తాజాగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి 'జక్కన్న' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేసినట్లు సమాచారం.  ఈ చిత్రాన్ని 'ప్రేమకథాచిత్రమ్‌' నిర్మాత సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. మరి ఈ 'జక్కన్న' అయినా సునీల్‌ను గట్టెక్కిస్తాడో లేదో చూడాలి..!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019