Advertisementt

చిరుపై కోపమే కారణం అంటున్నారు..!

Sat 05th Dec 2015 07:03 PM
chiranjeevi,puri jagannath,loafer movie,varun tej,prabhas  చిరుపై కోపమే కారణం అంటున్నారు..!
చిరుపై కోపమే కారణం అంటున్నారు..!
Advertisement
Ads by CJ

మెగాహీరో వరుణ్‌తేజ్‌-దిశాపటాని జంటగా పూరీజగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లోఫర్‌'. కాగా ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 7వ తేదీన ఘనంగా జరుగనుంది. వాస్తవానికి ఈ చిత్రం ఆడియో వేడుకకు చిరంజీవి చీఫ్‌గెస్ట్‌గా వస్తాడని అందరూ భావించారు. కానీ పూరీ మాత్రం చీఫ్‌గెస్ట్‌గా ప్రభాస్‌ను ఆహ్వానించాడు. కాగా ఈ వేడుకకు మెగాఫ్యామిలీ నుండి ఎవ్వరూ హాజరుకారని సమాచారం. తన 150వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం మెగాస్టార్‌ చిరంజీవి పూరీజగన్నాథ్‌కి ఇచ్చినట్లే ఇచ్చి, మాట మాత్రంగా కూడా చెప్పకుండా అతడిని పక్కన పెట్టడంతో పూరీ చిరంజీవి అంటేనే మండిపడుతున్నాడని అందువల్లే ఆయన చిరంజీవిని ఈ వేడుకకు చీఫ్‌గెస్ట్‌గా పిలవలేదనే ప్రచారం మొదలైంది. దీంతోనే ఆయన ముందు జాగ్రత్తగా ప్రభాస్‌ను లైన్లో పెట్టాడని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని నిర్మాత సి.కళ్యాణ్‌ ఖండిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో వేడుక కోసం చిరంజీవి ఆల్‌రెడీ వీడియో బైట్స్‌ ఇచ్చాడని, వాటిని ఆడియో వేడుకలో ప్రదర్శిస్తామని అంటూ తెలివిగా తప్పించుకునేలా మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవానికి మాత్రం పూరీ కావాలనే మెగాస్టార్‌ను పక్కనపెట్టాడనే విషయం సామాన్యులకు కూడా అర్ధం అవుతోందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ