Advertisementt

అక్కడా ఫ్లాపే..!

Fri 04th Dec 2015 12:35 PM
brucelee movie,ram charan,srinuvaitla,bhadrakali films,malayalam  అక్కడా ఫ్లాపే..!
అక్కడా ఫ్లాపే..!
Advertisement
Ads by CJ

నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో రామ్‌చరణ్‌ హీరోగా ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'బ్రూస్‌లీ'. ఈచిత్రం డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మితమై దసరా కానుకగా అక్టోబర్‌ 16న విడుదలైంది. మార్నింగ్‌ షోకే ఈ చిత్రానికి అట్టర్‌ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేరళలో భారీగా అంటే 60థియేటర్లలో నవంబర్‌ 27న విడుదలైంది. మలయాళంలోనూ అదే టైటిలను పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో అనువాద హక్కులను తీసుకున్న భద్రకాళి ఫిల్మ్స్‌ వారే మలయాళంలో కూడా విడుదల చేశారు, ఈచిత్రానికి మలయాళంలో కూడా ఫ్లాప్‌టాక్‌ వచ్చింది. రెండో రోజు నుండే థియేటర్లు ఖాళీగా ఉండిపోయాయి. తెలుగులో ఆల్‌రెడీ ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఈ చిత్రానికి మలయాళంలో కూడా ఎలాంటి హైప్‌ రాలేదు. మరి ప్రింటు ఖర్చులైన వస్తాయో లేదో చూడాలి...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ