Advertisementt

కొత్త జోనర్‌ను టచ్‌ చేస్తోన్న నాని..!

Fri 04th Dec 2015 12:11 PM
nani,hanu raghavapudi,jai balayya,indraganti mohankrishna,crime jonar  కొత్త జోనర్‌ను టచ్‌ చేస్తోన్న నాని..!
కొత్త జోనర్‌ను టచ్‌ చేస్తోన్న నాని..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో దాదాపు ప్రతి ఒక్క సినిమాను డిఫరెంట్‌గా చేస్తూ వస్తున్న నేచురల్‌ స్టార్‌ నాని. మంచి నటునిగా పేరుతెచ్చుకోవడమే కాదు.. సినిమా సినిమాకు కొత్త తరహా కథాంశాలను ఎంచుకుంటూ తన నటన, క్యారెక్టరైజేషన్‌లో కూడా వేరియేషన్స్‌ చూపిస్తున్నాడు నాని. ప్రస్తుతం ఆయన 14రీల్స్‌ వంటి బడా సంస్థలో హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రంలో నాని బాలకృష్ణ అభిమానిగా, చేతులపై జై బాలయ్య అనే టటూ వేసుకొని నటిస్తున్నాడు. ఈ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, సినిమా కూడా చాలా బాగా వస్తోందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రం తర్వాత తనను ఇండస్ట్రీకి నటునిగా పరిచయం చేసిన ఇంద్రగంటిమోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి నాని రెడీ అవుతున్నాడు. ఫ్లాప్‌లో ఉన్న తన గురువుకు ఓ చిత్రం చేసి రుణం తీర్చుకోవాలని నాని ఆరాటపడుతున్నాడు. కాగా ఈ చిత్రం క్రైమ్‌ జోనర్‌లో రూపొందనుందని సమాచారం. ఇది ఓ మర్డర్‌ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనుంది. ఇప్పటివరకు ఇలాంటి జోనర్‌లో నాని సినిమా చేయలేదు. మరి ఈ సరికొత్త కథాంశం నానితో పాటు ఇంద్రగంటికి కూడా మంచి విజయాన్ని అందిస్తుందనే ఆశతో వారి సన్నిహితులు, అభిమానులు ఉన్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ