Advertisementt

రెట్టించిన ఉత్సాహంతో 'నాన్నకు ప్రేమతో'..!

Wed 02nd Dec 2015 11:23 PM
nannaku prematho movie,one nenokkadine,ntr,mahesh babu,sukumar  రెట్టించిన ఉత్సాహంతో 'నాన్నకు ప్రేమతో'..!
రెట్టించిన ఉత్సాహంతో 'నాన్నకు ప్రేమతో'..!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఉత్సాహాన్ని దర్శకుడు సుకుమార్‌ డబుల్‌ చేశాడు. మహేష్‌బాబుతో '1' (నేనొక్కడినే) వంటి డిజాస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌తో సుకుమార్‌ సినిమా చేస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్‌ అభిమానులు ఆందోళన చెందారు. '1' (నేనొక్కడినే) తరహాలోనే తమ అభిమాన హీరోతో సుక్కు ఎలాంటి ప్రయోగం చేస్తాడేమో అని భయపడ్డారు. ప్రయోగం పేరుతో ప్రేక్షకులకు అర్థం కాని సినిమా తీస్తాడని అందరూ ఆందోళన చెందారు. దీంతో ఇప్పటివరకు 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి ఎన్టీఆర్‌ ఒక్కడే ప్లస పాయింట్‌గా ఉంటూ వచ్చాడు. ఈ సినిమాకు ముందు సుకుమార్‌ ఓ ఫ్లాప్‌ డైరెక్టర్‌. తాజాగా 'కుమారి 21ఎఫ్‌' సినిమాతో సుకుమార్‌ మరలా అద్బుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. పేరుకు ఆయన ఆయన కేవలం సమర్పకుడే అయినప్పటికీ ఈ చిత్రానికి అన్ని సుకుమారే. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ ... ఇలా అన్ని సుక్కునే. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్‌కు తోడుగా సుకుమార్‌ కూడా 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి ఉన్న క్రేజ్‌ను డబుల్‌ చేశాడు. దీంతో నందమూరి అభిమానులు ఇప్పుడు ఎంతో ఖుషీగా ఉన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ