Advertisementt

నేరం చేయబోతున్న కుర్ర హీరో

Mon 30th Nov 2015 03:01 PM
neram,sandeep kishan,neram telugu remake,ani kanneganti  నేరం చేయబోతున్న కుర్ర హీరో
నేరం చేయబోతున్న కుర్ర హీరో
Advertisement
Ads by CJ

కుర్ర హీరో సందీప్ కిషన్ గత కొన్నాళ్ళుగా స్పీడు మందగించాడు. టైగర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో సందీప్ ఒక మంచి కథ, మంచి దర్శకుడు కోసం వేచి చూస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత మళ్ళీ అంతటి బ్రేక్ రాకపోవడం కూడా సందీప్ కలవరపడే అంశం. మేనమామ చోటా కే నాయుడు సపోర్టు ఉన్నప్పట్టికీ అన్నీ కుదిరితేనే కదా, హిట్టు దక్కేది. కొంత కాలం వెయిట్ చేసయినా సరే, సరైన కథనే పట్టేసాడు ఇప్పుడు. తమిళ, మళయాళ భాషల్లో రెండేళ్ళ క్రితం ప్రయోగాత్మకంగా తీయబడి హిట్ సాధించిన నేరం అనే  సినిమాను ఇప్పుడు సందీప్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. బ్లాక్ కామెడీ, థ్రిల్లరుగా రూపొందిన ఈ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం సాధించింది. అందుకే తెలుగు రీమేక్ హక్కులు సంపాదించి, అని కన్నెగంటి దర్శకుడిగా తొందరోల్నే షూటింగుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అని కన్నెగంటి ఇంతకు మునుపు అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ