మహేష్ చేయాల్సింది సూర్య చేస్తున్నాడు..!

Fri 27th Nov 2015 05:59 PM
mahesh babu,surya,24 movie,vikram k kumar,samantha  మహేష్ చేయాల్సింది సూర్య చేస్తున్నాడు..!
మహేష్ చేయాల్సింది సూర్య చేస్తున్నాడు..!
Sponsored links

తమిళస్టార్‌ సూర్య హీరోగా 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '24'. ఈ చిత్రం టైటిల్‌తోనే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఈ సినిమా అనౌన్స్‌ అయినప్పటినుండి ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో ఆ అంచనాలు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉండటం, 'మనం' దర్శకుడి సినిమా కావడంతో ఈ చిత్రానికి తెలుగునాట కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తుండటం, మరోపక్క వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న సూర్య తన సొంతబేనర్‌ అయిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం కూడా ఈ క్రేజ్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఈ చిత్రానికి తమిళంలో భారీ స్థాయిలో బిజినెస్‌ జరుగుతోంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి పలు పెద్ద పెద్ద నిర్మాణసంస్థలు పోటీపడుతున్నాయి. వాస్తవానికి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో తీయాలని విక్రమ్‌కుమార్‌ ప్రయత్నించినట్లు టాలీవుడ్‌ సమాచారం. మొదట ఈ స్క్రిప్ట్‌ను విక్రమ్‌కుమార్‌ మహేష్‌బాబుతో చేయాలని భావించడంతో పాటు మహేష్‌కు స్క్రిప్ట్‌ మొత్తం వినిపించాడట. అయితే ఫస్టాఫ్‌ మహేష్‌ బాబుకు విపరీతంగా నచ్చినప్పటికీ సెకండాఫ్‌ మాత్రం నచ్చలేదట. సెకండాఫ్‌లో ఆయన పలు మార్పులు చేర్పులు చెప్పినప్పటికీ వాటిని చేయడం ఇష్టంలేని విక్రమ్‌కుమార్‌ సూర్యను కలిసి ఈ స్టోరీ వినిపించాడట. అంతేకాదు.. తన సొంతంగానే ఈ చిత్రాన్ని చేయడానికి సూర్య రెడీ అయ్యాడట. మరి మహేష్‌బాబు నిర్ణయం కరెక్టా? కాదా? అన్న విషయం వచ్చే సంక్రాంతికి తేలిపోతుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని పొంగల్‌ కానుకగా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తూన్నారు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019