నిఖిల్ కు ఈసారి ముగ్గురు..!

Wed 25th Nov 2015 03:03 PM
nikhil,tiger director anandh,thapsee,colors swathi,avikagor  నిఖిల్ కు ఈసారి ముగ్గురు..!
నిఖిల్ కు ఈసారి ముగ్గురు..!
Advertisement
Ads by CJ

విభిన్న కథాంశాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే యంగ్‌ హీరో నిఖిల్‌ త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. కాగా ఆయన నటించిన 'శంకరాభరణం' డిసెంబర్‌ 4న విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలైనే వెంటనే నిఖిల్‌ తన తాజా చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కాస్టింగ్‌ జరుగుతోంది. సందీప్‌ కిషన్‌తో 'టైగర్‌' చిత్రం తీసిన ఆనంద్‌తో ఈ చిత్రాన్ని నిఖిల్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ నిఖిల్‌తో రొమాన్స్‌ చేయనున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా తాప్సి నటించనుండగా, మరో హీరోయిన్‌గా అవికాగోర్‌ నటించనుంది. మూడో హీరోయిన్‌గా నటించమని ప్రస్తుతం కలర్స్‌ స్వాతిని అడుగుతున్నారు. కాగా ఈ చిత్రం డిసెంబర్‌ 2వ వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి ఈ చిత్రంతో నిఖిల్‌ ఏ సంచనాలను సృష్టిస్తాడో వేచిచూడాల్సివుంది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ