Advertisementt

టాలీవుడ్‌ ఎదురుచూపులు..!

Sun 22nd Nov 2015 06:14 PM
bengal tiger,size zero,shankarabharanam,loafer  టాలీవుడ్‌ ఎదురుచూపులు..!
టాలీవుడ్‌ ఎదురుచూపులు..!
Advertisement
Ads by CJ

తెలుగులో ఓ మంచి హిట్టు వచ్చి చాలాకాలం అయింది. ఈ సంవత్సరం సెకండాఫ్‌కు 'బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్‌'లతో అదిరి పోయే ఆరంభం వచ్చింది. కానీ 'భలే భలే మగాడివోయ్‌' చిత్రం తర్వాత చెప్పుకోదగిన హిట్‌ ఇప్పటికీ రాలేదు. ఎన్నో ఆశలతో వచ్చిన 'బ్రూస్‌లీ, అఖిల్‌' చిత్రాలు ఘోరంగా ఫ్లాప్‌ అయ్యాయి. 'రుద్రమదేవి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రాలు యావరేజ్‌లుగానే మిగిలాయి. దీంతో రాబోయే 40రోజుల్లో అయినా టాలీవుడ్‌కు పెద్ద హిట్‌ వస్తుందేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. వీటిల్లో అనుష్క 'సైజ్‌జీరో', రవితేజ 'బెంగాల్‌టైగర్‌', నిఖిల్‌ 'శంకరాభరణం' చిత్రాలపై అందరూ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ముఖ్యంగా రవితేజ నటించిన 'బెంగాల్‌టైగర్‌' గానీ సూపర్‌హిట్‌ అయిందంటే ఏకంగా 40కోట్లను సాదించడం అసాధ్యమేమీ కాదు. ఇక డిసెంబర్‌లో వచ్చే నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో', గోపీచంద్‌ 'సౌఖ్యం', మోహన్‌బాబు, అల్లరినరేష్‌ల కలయికతో రానున్న 'మామ మంచు... అల్లుడు కంచు', 'లోఫర్‌' వంటి చిత్రాలపై కూడా భారీగానే ఆశలు ఉన్నాయి. మరి వీటిల్లో బ్లాక్‌బస్టర్‌ను అందించే చిత్రం ఏమిటి? అనేది ఎదురుచూడాల్సిన అంశం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ