Advertisementt

స్వాతికి మరో అవకాశం..!

Thu 19th Nov 2015 10:44 AM
swathi,tripura movie,bellamkonda sai srinivas,konda vijaykumar  స్వాతికి మరో అవకాశం..!
స్వాతికి మరో అవకాశం..!
Advertisement
Ads by CJ

ఇటీవల విడుదలైన 'త్రిపుర' ఫ్లాప్‌తో కలర్స్‌ స్వాతి నీరసపడిపోయింది. చేతిలో హిట్లున్నప్పుడే అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చాయి. ఇక ఫ్లాప్‌లు ఎదురైతే వేరే చెప్పాలా? అందుకే 'త్రిపుర'తో స్వాతి చాలా డిజప్పాయింట్‌ అయింది. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్వాతి ముందుకు ఓ ఆఫర్‌ వచ్చింది. బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ డైరెక్షన్‌లో ఓచిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా స్వాతిని అనుకున్నట్లు సమాచారం. 'గుండెజారి గల్లంతయ్యిందే' హిట్‌తో కొండాకు భారీ అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమా ఫ్లాప్‌ కావడంతో కొండాతో డీల్‌ కుదుర్చుకోవడానికి హీరోలు వెనుకంజ వేశారు. ఈ దశలో ఆయనకు బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చాన్స్‌వచ్చింది. మరి మూడో సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ