Advertisementt

నాన్నకు ప్రేమతో రిజల్ట్ కుమారితో తెలుస్తుంది!

Wed 18th Nov 2015 12:40 PM
kumari 21 f,sukumar,nannaku prematho  నాన్నకు ప్రేమతో రిజల్ట్ కుమారితో తెలుస్తుంది!
నాన్నకు ప్రేమతో రిజల్ట్ కుమారితో తెలుస్తుంది!
Advertisement
Ads by CJ

సుకుమార్ ఎంతటి గొప్ప రచయితో అంతటి గొప్ప దర్శకుడు కూడా. ఇతని సినిమా కథలు జనాలకు ఏమో గాని హీరోలకు మాత్రం తెగ నచ్చేస్తాయి. అందుకే మహేష్ బాబు ఇప్పటికి కూడా వన్ నేనొక్కడినే చిత్రాన్ని తన కెరీర్లో వన్ అఫ్ ది బెస్ట్ అన్నట్టుగా పొగిడి పారేస్తుంటాడు. నిజమేమిటంటే ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభూతులు నిర్మాతలకు, పంపిణీదారులకు అన్నీ ఇన్నీ కావు. మరి మహేష్ బాబు సినిమాతో లెక్కల్లో తప్పులు ఎక్కడ దొర్లాయో నేర్చుకున్న సుకుమార్ ఆ తప్పులన్నీ సరిదిద్దుకునేలా జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతోను తీర్చి దిద్దుతున్నాడా అంటే కుమారి 21 ఎఫ్ చూసి చెప్పాల్సిందే అంటూన్నారు సినీ పండితులు. రాజ్ తరుణ్, హేబా పటేల్ నటించిన ఈ మూవీ యువతను సెంటర్ చేస్తూ మరో రెండు రోజుల్లో వస్తోంది. సుకుమార్ కథ, కథనం అందిచాడు కాబట్టి, ఇంకా తన కన్ఫ్యూజింగ్, కాంప్లెక్స్ పాత దారినే పట్టుకు వెళ్ళాడాడా లేక సాదాసీదాగా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పగలిగాడా అన్నది తేలాల్సి ఉంది. కుమారి గనక మంచి మార్కులు సంపాదించి అగ్ర శ్రేణిలో పాస్ అయిపోతే ఫైనల్ పరీక్షకు ముందు పెట్టె ప్రీ ఫైనల్ పరీక్షలో సుక్కు ఉత్తీర్ణుడు అయినట్టే. అంటే నాన్నకు ప్రేమతో రిజల్ట్ కుమారి 21 ఎఫ్ మీద ఎంతో కొంత ఆధారాపడుతుంది అంటారా... సరే కానియ్యండి! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ