'డిక్టేటర్‌'లో ఒక్కపాటకు ఇంత ఖర్చా!

ఎన్ని భారీ హంగులతో సినిమాను తీర్చిదిద్దితే అంత బాగుంటుంది.... బిజినెస్‌ బాగా అవుతుంది అని నమ్ముతున్నారు ఈనాటి దర్శకనిర్మాతలు. అందుకే పాటలు, ఫైట్లపై కోట్లు కుమ్మరిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా చేస్తున్న 'డిక్టేటర్‌'లోని ఓ పాట కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగా వెచ్చించాడు దర్శకుడు శ్రీవాస్‌. బాలకృష్ణ, వందల మంది డాన్సర్లతో ఈ పాటను హైదరాబాద్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ పాట కోసం ఓ భారీ సెట్‌ కూడా వేశారు. రోజుకి 30లక్షల చొప్పున దాదాపుగా కోటిరూపాయలకు పైగా మొత్తాన్ని ఈ పాట కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తానికి ఈ పాట ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందిట. తమన్‌ సంగీతం అందించిన ఈ పాట సినిమాకు హైలైట్‌ కానుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

dictator movie
balakrishna
srivas
big setup for song
Advertisement
Advertisement