Advertisementt

ఇది ప్రేక్షకుల బలికి పక్కా ప్లాన్‌లా వుంది!

Tue 17th Nov 2015 11:30 AM
tollywood producers,every friday,sankarabharanam,kona venkat,k radha mohan,bengal tiger,pvp,size zero  ఇది ప్రేక్షకుల బలికి పక్కా ప్లాన్‌లా వుంది!
ఇది ప్రేక్షకుల బలికి పక్కా ప్లాన్‌లా వుంది!
Advertisement
Ads by CJ

సినిమా విడుదల తేదీల విషయంలో నిర్మాతలంతా ఏకమయ్యారు. ప్రతి శుక్రవారం ఒకే పెద్ద సినిమాను విడుదల చేసి.. నిర్భంద విద్యలా .. ప్రేక్షకుడికి నిర్భంద సినిమా తరహాలో పక్కా ప్లాన్‌ను రెడీ చేశారు. ఇక నుంచి పరస్పర అవగాహనతో సినిమాల్ని విడుదల చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ప్రేక్షకుడి సినిమా వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. సాధారణంగా ప్రతి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో .. బాగున్నా చిత్రానికే జనాదరణ, కలెక్షన్లు వుంటాయి. అయితే ఇప్పుడు ప్రతివారం  ఒకే సినిమా విడుదలైతే ప్రతి వారం ఏదో ఒక  సినిమా చూసే అలవాటు వున్న  సినిమా లవర్స్, వీకెండ్‌లో థియేటర్స్‌కు వెళ్లి సినిమాను వీక్షిద్దామనుకునే ఫ్యామిలీ ఆడియన్స్.. తప్పకుండా  ఆ చిత్రం బాగున్నా.. బాగాలేకపోయినా చూడాల్సిందే. ఎందుకంటే వారికి ప్రత్యామ్నాయం లేకుండా ఒకే సినిమాను విడుదల చేస్తున్నారు. సో.. ఇది ఆడియన్స్ బలికి పక్కా ప్లాన్‌లా వుందని అభిప్రాయపడుతున్నారు సినీజనాలు. అయితే సినిమా బాగుంటేనే చూసే ఆడియన్స్‌కు పెద్దగా లాస్ వుండదు కానీ తప్పకుండా వారంలో ఓ సినిమా చూసి తీరాలనుకునే సినీలవర్స్‌కు మాత్రం ఈ నిర్ణయం అంతగా రుచించదు. అయితే ఈ ప్లాన్‌లో  భాగంగానే ఈ నెల 27న సైజ్‌జీరో, డిసెంబర్ 4న శంకరాభరణం,  డిసెంబర్ 10న బెంగాల్‌టైగర్ చిత్రాలను విడుదల చేయాలని సదరు నిర్మాతలు నిశ్చయించుకున్నారు. సో.. నిర్ణయం నిర్మాతలకు లాభమే.. అయితే ఇది ప్రేక్షకుల నెత్తిన టోపీ పెట్టే నిర్ణయమేనని అంటున్నారు చాలా మంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ