Advertisementt

నితిన్‌ డైరెక్టర్‌తో బెల్లంకొండ సినిమా!

Sun 15th Nov 2015 08:13 PM
nithiin,alludu srinu,konda vijay kumar,sundarpandiyan,bellamkonda sai srinivas  నితిన్‌ డైరెక్టర్‌తో బెల్లంకొండ సినిమా!
నితిన్‌ డైరెక్టర్‌తో బెల్లంకొండ సినిమా!
Advertisement
Ads by CJ

'అల్లుడు శీను' చిత్రంతో హీరోగా పరిచయం అయిన నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ తన రెండో చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాదించిన 'సుందరపాండ్యన్‌'కు ఇది రీమేక్‌. కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మూడో చిత్రం కూడా ఇప్పుడు కన్‌ఫర్మ్‌ అయింది. నితిన్‌ హీరోగా నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్ర దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ డైరెక్షన్‌లో సాయి శ్రీనివాస్‌ ఓ చిత్రం చేయనున్నాడు. ఈమేరకు ఆయనకు ఓ లవ్‌స్టోరీ వినిపించి గ్రీన్‌సిగ్నల్‌ అందుకున్నాడు కొండా. కాగా ఆయన రెండో చిత్రం 'ఒక లైలా కోసం' చిత్రం డిజాస్టర్‌ కావడంతో కొండాకు దర్శకునిగా ఇంత భారీ గ్యాప్‌ వచ్చింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేసే చిత్రం తో తనేంటో మరోసారి నిరూపించుకునేందుకు కొండా విజయకుమార్ పక్కా గా రెడీ అయినట్లుగా సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ