Advertisementt

అందరి వేళ్లు వినాయక్‌ వైపే..!

Sat 14th Nov 2015 07:42 PM
v.v.vinayak,akhil movie,nagarjuna,akhil akkineni  అందరి వేళ్లు వినాయక్‌ వైపే..!
అందరి వేళ్లు వినాయక్‌ వైపే..!
Advertisement
Ads by CJ

దీపావళికి ఓ రేంజ్‌లో పేలుతుందని అనుకొన్న 'అఖిల్‌' సినిమా తుస్సుమంది. అఖిల్‌ బాగా చేసినప్పటికీ వినాయక్‌ చెత్త టేకింగ్‌తో ఈ సినిమా ఫ్లాప్‌ చేశాడని విమర్శలు గుప్పుమంటున్నాయి. అఖిల్‌ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేకపోయాడని, వినాయక్‌ తనపై ఉంచిన అంచనాలు అందుకోలేకపోయాడని.. ఇలా అందరివేళ్లు వినాయక్‌పైనే చూపిస్తున్నాయి. అయితే వినాయక్‌ సహచరుల వాదన ఇంకోలా ఉంది. నాగార్జున విపరీతమైన జోక్యం వల్లే వినాయక్‌ ఏం చేయలేకపోయాడని, సినిమాని ట్రిమ్‌ చేయాలన్న ఉద్ధేశ్యంతో ఎడాపెడా కట్‌ చేసి పారేశాడని నాగ్‌ను తప్పు పడుతున్నారు. ఇలా ఎడాపెడా కట్‌ చేయడం వల్ల జంపింగ్‌లు ఎక్కువయ్యాయని, జూవా నేపథ్యంలో సాగే కొన్ని కీలకమైన ఎపిసోడ్స్‌కు కత్తెర్లు పడ్డాయని, లేదంటే ఫలితం మరోలా ఉండేదని చెబుతున్నారు. ఒత్తిడి ఎక్కువై వినాయక్‌ సరిగ్గా పని చేయలేకపోయాడని, నాగ్‌ వినాయక్‌కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదనేది వినాయక్‌ సన్నిహితుల వాదన. మొత్తానికి అటు నాగ్‌, ఇటు వినాయక్‌ కలిసి అఖిల్‌ ఎంట్రీని డిజాస్టర్‌ చేసిపడేశారని సినీ వర్గాలు అంటున్నాయి. మరి ఏం చేస్తాం...? టైమ్‌ బ్యాడ్‌గా ఉంటే ఇలాగే జరుగుతుందని కొందరు నిట్టూరుస్తున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ