Advertisementt

ఆ ముగ్గురికి సవాల్‌ విసురుతోన్న అఖిల్‌..!

Sat 14th Nov 2015 04:11 PM
akhil,akhil movie,allu arjun,ntr,ram charan,dance  ఆ ముగ్గురికి సవాల్‌ విసురుతోన్న అఖిల్‌..!
ఆ ముగ్గురికి సవాల్‌ విసురుతోన్న అఖిల్‌..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో టాప్‌ డాన్సర్స్‌ అంటే వినిపించే పేర్లు అల్లుఅర్జున్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. ఇప్పటివరకు ఈ ముగ్గురి మధ్యే డాన్స్‌వార్‌ జరుగుతోంది. రామ్‌, నితిన్‌ వంటి హీరోలు కూడా అద్భుతమైన డాన్సర్స్‌ అయినప్పటికీ పోటీ మాత్రం బన్నీ, ఎన్టీఆర్‌, చరణ్‌.. మధ్యే ఉంది. తాజాగా ఈ ముగ్గురు స్టార్స్‌కు పోటీగా అక్కినేని అఖిల్‌ వచ్చి చేరాడు. 'అఖిల్‌' చిత్రం కథని, గెలుపోటములను పక్కనపెడితే ఈ సినిమా చూసినవారందరూ అఖిల్‌ చేసిన డ్యాన్స్‌లు చూసి షాక్‌కు గురవుతున్నారు. స్ప్రింగ్‌లా మెలికలు తిరుగుతూ ఆయన వేసిన స్టెప్స్‌ ఆయన తండ్రి నాగార్జుననే కాదు.. ప్రేక్షకులందరి ఆకట్టుకుంటున్నాయి. అసలు 'అఖిల్‌' సినిమాకి హైలైట్‌ అంటూ ఏమైనా ఉందంటే అది అఖిల్‌ చేసిన డ్యాన్స్‌లే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. దీంతో టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారిన డాన్స్‌ వార్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. తన మొదటి చిత్రంతోనే డాన్స్‌ విషయంలో మిగిలిన ముగ్గురు స్టార్స్‌కు సవాల్‌ విసురతున్నాడు అఖిల్‌. మొత్తానికి టాలీవుడ్‌ డాన్స్‌వార్‌లోకి నాలుగో హీరో ఎంటర్‌ అయ్యాడు. మరి ఈ నలుగురి మధ్య జరిగే డాన్స్‌వార్‌ ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ