Advertisementt

సంక్రాంతికి పోటా పోటీ గా సందడి!

Fri 13th Nov 2015 06:42 PM
dictator,balakrishna,nannaku prematho,ntr,krishanashtami  సంక్రాంతికి పోటా పోటీ గా సందడి!
సంక్రాంతికి పోటా పోటీ గా సందడి!
Advertisement
Ads by CJ

మొత్తానికి అటు నందమూరి బాబాయ్‌ బాలకృష్ణ 'డిక్టేటర్‌'తో, జూనియర్‌ ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రాలతో ఒకేసారి సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా ఎవరు ఎదురు వచ్చినా తగ్గేది లేదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక తాజాగా ఈ బరిలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చాడు హీరో సునీల్‌. ఆయన హీరోగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'కృష్ణాష్టమి' సైతం సంక్రాంతి రేసులోకి దిగుతుంది. తమది పక్కా ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడం వల్ల తమకు ఏ చిత్రం పోటీ కాదని ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు ఆలోచనగా కనిపిస్తోంది. కాగా డిసెంబర్‌లో నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం రిలీజ్‌ ఉండటం, దీనికి తోడు 'మామ మంచు.. అల్లుడు కంచు'; గోపీచంద్‌ 'సౌఖ్యం'లు క్రిస్మస్‌ కానుకగా విడుదలవుతుండటంతో తనకు ఎంతో అచ్చివచ్చిన నెలను నాగ్‌ త్యాగం చేసి తాను కూడా తన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-నితిన్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న 'అ..ఆ..' చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో దింపి తన సత్తా చాటాలని త్రివిక్రమ్‌ అనుకుంటున్నాడట. మరి చివరకు సంక్రాంతి రేసులో ఎన్ని, ఏయేచిత్రాలు పోటా పోటి పడతాయో, ఎంత సందడి చేస్తాయో చూద్దాం..!!? 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ