Advertisementt

విశాల్ నిజంగానే సినిమా చూపిస్తున్నాడు!

Fri 13th Nov 2015 01:07 PM
vishal,nadigar elections,sarath kumar,varalakshmi  విశాల్ నిజంగానే సినిమా చూపిస్తున్నాడు!
విశాల్ నిజంగానే సినిమా చూపిస్తున్నాడు!
Advertisement
Ads by CJ

ఇంట గెలవకపోయినా రచ్చ గెలిచిన హీరో విశాల్‌. ఆయనకు 37ఏళ్లు వచ్చినా ఇంకా వివాహం కాలేదు. అయితే తాజాగా ఆయన తన పెళ్లి విషయంలో నోరు విప్పాడు. తాను ప్రేమ పెళ్లే చేసుకుంటానని, అందులోనూ ఓ హీరోయిన్‌ను తాను వివాహం చేసుకొంటానని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఆ హీరోయిన్‌ ఎవరో అందరికీ తెలిసిందే. శరత్‌కుమార్‌ కుమార్తె హీరోయిన్‌ వరలక్ష్మీతో కొంతకాలంగా ఈ నల్లనయ్య ప్రేమాయణం నడుపుతోన్న సంగతి తెలిసిందే. శరత్‌కుమార్‌, విశాల్‌ల మధ్య గొడవకి ఇది కూడా ఓ కారణం. ఇటీవల జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌ను విశాల్‌ ప్యానెల్‌ ఓడించి తన సత్తా చూపించాడు విశాల్‌. ఇలా నడిగర్‌ సంఘం ఎన్నికల్లోనే కాదు.. నిజజీవితంలోనూ శరత్‌కుమార్‌కు విశాల్‌ శత్రువుగా మారి తలనొప్పులు తీసుకొని వస్తున్నాడు. అందులోనూ ఎన్నికల్లో తన వాగ్దానమైన నడిగర్‌ సంఘానికి ఓ బిల్డింగ్‌ నిర్మించిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విశాల్‌. సో... ఈ ప్రేమవ్యవహారం, విశాల్‌ వివాహం వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ