Advertisementt

శర్వానంద్ హ్యాట్రిక్ కొడతాడా..!

Wed 11th Nov 2015 02:26 PM
express raja movie teaser,sharvanandh,surabhi,gandhi merlapaka  శర్వానంద్ హ్యాట్రిక్ కొడతాడా..!
శర్వానంద్ హ్యాట్రిక్ కొడతాడా..!
Advertisement
Ads by CJ

'రన్ రాజా రన్','మళ్లీ మళ్ళీ ఇది రాని రోజు' సినిమాల హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న శర్వానంద్ 'ఎక్స్ ప్రెస్ రాజా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం తరువాత మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సురభి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రబృందం దీపావళి కానుకగా సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు. స్క్రిప్ట్స్ ఎన్నుకోవడంలో కొత్తదనం చూపే శర్వానంద్ మరో కొత్త కథతో ప్రేక్షకులను అలరిస్తాడని టీజర్ ను చూస్తుంటే అర్ధమవుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం, రెండు సూపర్ హిట్స్ తరువాత శర్వా నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి. టీజర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో శర్వానంద్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. మరి ఈ సినిమా శర్వా కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ