Advertisementt

శ్యామ్‌ మాయలో రవితేజ..!

Sat 07th Nov 2015 01:00 PM
raviteja,kick,shyam,surendar reddy,yevado okadu movie  శ్యామ్‌ మాయలో రవితేజ..!
శ్యామ్‌ మాయలో రవితేజ..!
Advertisement
Ads by CJ

మాస్‌మహారాజా రవితేజ, 'ప్రేమమ్‌' చిత్రంతో మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్‌ జంటగా దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో 'ఎవడో ఒక్కడు' అనే టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్‌' దర్శకుడు వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా రవితేజ కెరీర్‌కు 'కిక్‌' సినిమా ఎంతటి విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విజయంలో శ్యామ్‌ కూడా కీరోల్‌ పోషించాడు. అందుకే ఈ సినిమాతో 'కిక్‌'నే తన ఇంటిపేరుగా మార్చుకొని కిక్‌శ్యామ్‌ అయ్యాడు. ఆ తర్వాత 'కిక్‌' సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తూ శ్యామ్‌ను తన 'రేసుగుర్రం'లో తీసుకొని మరో పెద్ద హిట్‌ కొట్టాడు దర్శకుడు సురేందర్‌రెడ్డి. దీంతో ఇప్పుడు రవితేజ కూడా కిక్‌ శ్యామ్‌ వైపుకు చూస్తున్నాడు. 'ఎవడో ఒకడు' చిత్రంలో కీలకపాత్ర కోసం శ్యామ్‌ని ఎంపిక చేశారు. 'కిక్‌' సినిమా తరహాలోనే రవితేజతో పోటాపోటీగా ఢీకొట్టే పాత్రను ఈ చిత్రంలో శ్యామ్‌ పోషించనున్నాడు. మరి సురేందర్‌రెడ్దిలా కిక్‌శ్యామ్‌ సెంటిమెంట్‌ రవితేజకు కలిసి వస్తుందో లేదో చూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ