నితిన్‌ కొత్త సినిమా విశేషాలు..!

'అఖిల్‌' సినిమా ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసుకొంటూ తన కెరీర్‌ను దాదాపు కొంత కాలం పక్కనపెట్టేశాడు హీరో నితిన్‌. కాగా ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో 'అ...ఆ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌తో పూర్తికానుంది. ఈ సినిమా తర్వాత నితిన్‌ కొత్త దర్శకుడు ఎమ్‌.వి. నారాయణ డైరెక్షన్‌లో సాయితేజ ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ సంస్థలో ఓ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపాడు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వెలిగొండ శ్రీనివాస్‌ అందించిన కథకు, కృష్ణచైతన్య మాటలు అందించనున్నాడు. కాగా ఈ చిత్రం జనవరి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. 

akhil movie
nithin
a aa movie
trivikram sreenivas