శృతి.. కాస్త తగ్గితే బెటర్..!

Sat 31st Oct 2015 08:57 PM
sruthihassan,resugurram,sreemanthudu,one crore remuneration  శృతి.. కాస్త తగ్గితే బెటర్..!
శృతి.. కాస్త తగ్గితే బెటర్..!
Advertisement
Ads by CJ

హీరోయిన్లకు మన తెలుగు సినిమాలు ఓ మెట్టుగా ఉపయోగపడతాయనే మాటే కానీ, చాలామంది పరభాషా హీరోయిన్లకు తెలుగు అంటే చిన్న చూపు అని చెప్పాలి. కాగా దీనికి ఉదాహరణగా శృతిహాసన్‌ను చెప్పుకోవచ్చు. ఆమె రేసుగుర్రం సమయంలో 80లక్షల పారితోషికం పుచ్చుకుంది. ఆ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో శ్రీమంతుడు చిత్రానికి డిమాండ్‌ చేసి మరీ కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక శ్రీమంతుడు సూపర్‌డూపర్‌ హిట్‌ కావడంతో తన రెమ్యూనరేషన్‌ను మరో అరకోటికి పెంచి ప్రస్తుతం కోటిన్నర ఇవ్వందే సైన్‌ చేసే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెబుతోందిట. దాంతో ఆమె వైపు చూడాలంటేనే నిర్మాతలు భయపడిపోతున్నారు. తనకు తెలుగు సినిమాలు ముఖ్యం కాదని, కేవలం తమిళ, హిందీ చిత్రాలపైనే తన ఫోకస్‌ ఎక్కువగా ఉన్నట్లు తనను కలిసిన తెలుగు నిర్మాత, దర్శకులకు బాహాటంగానే చెబుతోంది. మరీ ఆమె ఇలా శృతి మించడం మంచిది కాదని, కెరీర్‌ ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు పిలిచి మరీ ఆహ్వానించిన టాలీవుడ్‌ను ఆమె చిన్న చూపు చూడటం ఆమె కెరీర్‌కు మంచిది కాదని టాలీవుడ్‌ వర్గాలు ఆమెపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ