Advertisementt

టెన్షన్‌ పెడుతోన్న స్టార్‌ డైరెక్టర్స్‌..!

Sat 31st Oct 2015 07:52 PM
maruthi,hareesh shankar,krish,gopichand malineni  టెన్షన్‌ పెడుతోన్న స్టార్‌ డైరెక్టర్స్‌..!
టెన్షన్‌ పెడుతోన్న స్టార్‌ డైరెక్టర్స్‌..!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఓ సినిమా ముగింపు దశకు వచ్చేసరికి తమ తదుపరి చిత్రం ఏమిటో మన డైరెక్టర్స్‌ చిన్నగా హింట్‌ ఇస్తారు. వాట్‌ నెక్ట్స్‌ అనేది దానిపై క్లూ ఇస్తుంటారు. కానీ కొంతమంది డైరెక్టర్స్‌ మాత్రం టెన్షన్‌తో చంపేస్తున్నారు. మారుతి, క్రిష్‌, గోపీచంద్‌ మలినేని, హరీష్‌ శంకర్‌, శ్రీనువైట్ల ఇలా చాలామంది తమ తదుపరి చిత్రాలు ఏమిటి అనే విషయంలో మౌనం దాలుస్తున్నారు. మారుతి వెంకటేష్‌తో, గోపీచంద్‌ మలినేని వరుణ్‌తేజ్‌తో చేస్తున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ వారు మాత్రం నోరు విప్పడం లేదు. తమ తర్వాతి చిత్రాలపై ఈ దర్శకులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక కృష్ణవంశీ ఏడాదిపైగా ఖాళీగా ఉన్నాడు. వీరికి తోడు అల్లరి రవిబాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి దర్శకుల తదుపరి చిత్రాలపై కూడా క్లారిటీ లేదు. మరి వీరు ఏయే హీరోలతో చేస్తారో... కాలం గడిచే కొద్ది తెలుస్తుందేమో వేచిచూడాలి...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ