Advertisementt

కీలక పాత్రలో హరికృష్ణ రీఎంట్రీ..!

Wed 28th Oct 2015 11:01 AM
nanadamoori harikrishna,ntr,nannaku prematho,koratala siva  కీలక పాత్రలో హరికృష్ణ రీఎంట్రీ..!
కీలక పాత్రలో హరికృష్ణ రీఎంట్రీ..!
Advertisement
Ads by CJ

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రి మూవీస్‌ సంస్థ నిర్మించనున్న చిత్రం పూజాకార్యక్రమాలు ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి జనతాగ్యారేజ్‌ అనే టైటిల్‌ను ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే ఉపశీర్షిక పెట్టనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో ఓ పెద్ద నటుడు అతిది పాత్రలో కనిపిస్తాడని కొరటాల శివ చెప్పిన విషయం తెలిసిందే. ఆ పాత్రను ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణ పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల హరికృష్ణ నటనకు దూరంగా ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు రూపొందుతున్న నాన్నకు ప్రేమతో చిత్రంలో హరికృష్ణ నటించాల్సి వుంది. కానీ అనారోగ్య కారణాల వల్ల ఆయన ఒప్పుకోలేదు. కానీ కొరటాల శివ చిత్రంలో మాత్రం తన తండ్రిని నటించమని ఎన్టీఆర్‌ బాగా ఒత్తిడి చేయడంతో మరలా ముఖానికి రంగు వేసేందుకు హరికృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన చేసేది అతిథి పాత్రే అయినా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ