Advertisementt

నందమూరి ఫ్యాన్స్ కి దసరా ట్రీట్ అదిరింది!

Sun 25th Oct 2015 12:20 AM
  నందమూరి ఫ్యాన్స్ కి దసరా ట్రీట్ అదిరింది!
నందమూరి ఫ్యాన్స్ కి దసరా ట్రీట్ అదిరింది!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ నందమూరి అభిమానులకు దసరా కానుకగా తాను నటిస్తున్న డిక్టేటర్‌ టీజర్‌ను కానుకగా ఇచ్చాడు. నిమిషం నిడివి గల ఈ టీజర్‌ ఇప్పుడు నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే అందులో పంచ్‌ డైలాగ్‌లు బ్రహ్మాండంగా ఉండాలని ఆయన అభిమానులు ఆశిస్తారు. అందుకు తగ్గట్లే డిక్టేటర్‌ టీజర్‌లో బాలయ్య వదిలిన రెండు పంచ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ టీజర్‌లో బాలయ్య పలు డిఫరెంట్‌ లుక్స్‌లో దర్శనమిస్తున్నాడు. హీరోయిన్లు అంజలి, సోనాల్‌చౌహాన్‌ల గ్లామర్‌ కూడా ఈ చిత్రానికి ప్లస్‌ కానుందని అర్థం అవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ రేయ్‌ నీ హిస్టరీలో బ్లడ్డుందేమో.. కానీ నా బ్లడ్‌కే హిస్టరీ ఉంది అనే డైలాగ్‌తో పాటు మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. నాలాంటి వాడిని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం.. అంటూ బాలయ్య చెప్పిన రెండు డైలాగ్స్‌ అందరినీ ఆలరిస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ