Advertisement

గుజరాత్‌ వెళ్తోన్న సర్దార్‌..!

Tue 20th Oct 2015 02:43 AM
pawan kalyan,sardhar gabbarsingh,gujarath shooting  గుజరాత్‌ వెళ్తోన్న సర్దార్‌..!
గుజరాత్‌ వెళ్తోన్న సర్దార్‌..!
Advertisement

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌. కాగా ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే వారం గుజరాత్‌కు వెళ్లనుంది. యూనిట్‌ మొత్తం గుజరాత్‌ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను తీయనున్నారు. మొత్తంగా గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంతో పాటు పలు చోట్ల ఈ చిత్రం షూటింగ్‌ 25రోజుల పాటు జరగనుందని సమాచారం. వాస్తవానికి ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ను గుజరాత్‌లోనే ప్లాన్‌ చేశారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఆ షెడ్యూల్‌ ఇప్పుడు తీస్తున్నారు. క్లైమాక్స్‌ సన్నివేశాలను కూడా అక్కడే తీయనున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement