Advertisementt

సల్మాన్‌ హీరోయిన్ల బరితెగింపు..!

Mon 19th Oct 2015 11:11 AM
  సల్మాన్‌ హీరోయిన్ల బరితెగింపు..!
సల్మాన్‌ హీరోయిన్ల బరితెగింపు..!
Advertisement
Ads by CJ

హేట్‌స్టోరీ సిరీస్‌లో మూడో భాగంగా తెరకెక్కుతోన్న హేట్‌స్టోరీ3 చిత్రం ట్రైలర్‌ విడుదలై దేశాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. పచ్చి శృంగార సన్నివేశాలతో నిండిపోయిన ఈ చిత్రంలో సల్మాన్‌ సరసన నటించిన జరైన్‌ఖాన్‌తో పాటు సల్మాన్‌ అండతో నటిగా మారిన డైసీషాలు ఈ చిత్రంలో తమ హాట్‌హాట్‌ సన్నివేశాలతో అదరగొడుతున్నారు. సల్మాన్‌ సరసన చేసినప్పటికీ సరైన చాన్స్‌లు రాకపోవడంతో వారు ఇలా అవకాశాలు లేక పచ్చి శృంగార పాత్రలను చేస్తున్నారంటూ బాలీవుడ్‌ వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో వీరిద్దరిని బిగ్రేడ్‌ హీరోయిన్స్‌గా పరిగణిస్తూ...వారిద్దరి కంటే సన్నిలియోనే బెటర్‌ అంటున్నారు. కాగా ఇలాంటి వాటి ద్వారానే తమ చిత్రాలకు ఫ్రీ పబ్లిసిటీ లభిస్తోందని దర్శకుడు విశాల్‌పాండే అంటుండగా, హేట్‌స్టోరీ 2 ద్వారా భారీ లాభాలను ఆర్జించిన భూషణ్‌కుమార్‌ ఈ చిత్రం నిర్మాత. మరి ట్రైలరే ఇలా ఉంటే రేపు సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రం థియేటర్లలో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో? ఎన్ని వివాదాలకు మూలం అవుతుందో? అని విశ్లేషకులు ముందుగానే ఈ సినిమాపై ఓ కన్నేసి ఉంచారు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ