Advertisementt

మొత్తానికి బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది..!

Wed 14th Oct 2015 07:19 AM
rey movie,sayamikher,maniratnam,nani,karthi  మొత్తానికి బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది..!
మొత్తానికి బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది..!
Advertisement
Ads by CJ

రేయ్‌ చిత్రంలో నటించిన సయామీఖేర్‌ ఆ చిత్రం సరిగ్గా ఆడకపోయేసరికి పెద్దగా అవకాశాలు రాక... చకోరపక్షిలా ఎదురుచూస్తోంది. రేయ్‌ ఫ్లాప్‌ కావడంతో మన దర్శకనిర్మాతలు, హీరోలు కూడా ఆమెను లైట్‌గా తీసుకున్నారు. తాజాగా ఆమెకు ఎవ్వరూ ఊహించని ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఏకంగా క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం సినిమాలో అవకాశం సంపాదించింది. ఎంత పెద్ద హీరోయిన్‌కైనా మణిరత్నం హీరోయిన్‌ అనిపించుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆయన చిత్రంలో నటిస్తే వారికి వచ్చే సంతృప్తి, ప్రసంశలు ఎంతో గొప్పగా ఉంటాయి. తాజాగా మణిరత్నం కార్తీ-దుల్కర్‌ సల్మాన్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దుల్కర్‌ సల్మాన్‌ సరసన నిత్యామీనన్‌ను ఎంపిక చేశారు. కాగా కార్తికి జోడీగా త్రిషను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు సయామీఖేర్‌కు ఈ అరుదైన అవకాశం వచ్చింది. మరి ఆమె ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందో వేచిచూడాల్సివుంది..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ