Advertisementt

బాహుబలి2 ఇప్పుడే రాదా..?

Tue 13th Oct 2015 09:07 AM
bahubali the conclusion,rajamouli,prabhas,anushka  బాహుబలి2 ఇప్పుడే రాదా..?
బాహుబలి2 ఇప్పుడే రాదా..?
Advertisement
Ads by CJ

రాజమౌళి బాహుబలి.. ది బిగినింగ్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో.. ఇలా దేశంలోని అన్ని భాషల్లో విడుదలై ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం సెకండ్‌ పార్ట్‌ ఎప్పటినుండి మొదలుకానుంది? బాహుఐలి.. ది కంక్లూజన్‌ విడుదల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ రెండో పార్ట్‌ నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభించుకొని, 2016 వేసవిలో వస్తుందని అందరూ భావించారు. కానీ పెరిగిన అంచనాల వల్ల, స్టోరీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తుండటం వల్ల ఈ చిత్రం మరో ఏడాది తర్వాత అంటే దాదాపు 2017లో కానీ ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేలా.. ఎవ్వరూ ఊహించలేని ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని మరింత పకడ్బందీగా రూపొందించడానికే రాజమౌళి అండ్‌ టీమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ