డబ్బింగ్ సినిమాకు పదేళ్ల పండగ!

Mon 12th Oct 2015 12:33 PM
suresh kondeti,premisthe movie,premisthe 10 years complete,suresh kondeti premisthe hungama  డబ్బింగ్ సినిమాకు పదేళ్ల పండగ!
డబ్బింగ్ సినిమాకు పదేళ్ల పండగ!
Advertisement
Ads by CJ

పదేళ్ల క్రితం తమిళంలో విడుదలైన కాదల్ చిత్రాన్ని తెలుగులోకి ప్రేమిస్తే పేరుతో విడుదల చేశాడు నిర్మాత సురేష్ కొండేటి. నిర్మాతగా ఆయనకు అది తొలిచిత్రం. ఆ రోజుల్లో హృదయాన్ని కదిలించిన చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఈ సోమవారం (12వ తేది) నాటికి పదేళ్లు పూర్తిచేసుకుందని ఓ ఫంక్షన్‌ను జరిపాడు సురేష్ కొండేటి. ఆ చిత్ర మాతృక నిర్మాత ప్రముఖ దర్శకుడు శంకర్,  చిత్ర దర్శకుడు బాలాజీ శక్తివేల్ కూడా ఈ చిత్రానికి వున్న క్రేజ్ గ్రహించలేకపోయారు సుమా..! సురేష్ కొండేటి మాత్రం ప్రేమిస్తే ను ఓ స్ట్రయిట్ చిత్రంలా భావించి.. ఆ చిత్రాన్ని తానే నిర్మించినట్లుగా...ప్రేమిస్తే ను పదేళ్ళ ఫంక్షన్‌తో సత్కరించాడు. ఎంతైనా సురేష్ కొండేటి గ్రేట్ అని కొంత మంది అంటుంటే.. మరికొంత మంది మాత్రం డబ్బింగ్ చిత్రానికి ఇంత హంగామా అవసరమా? అంటున్నారు.! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ