Advertisementt

మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వదా..!

Sun 11th Oct 2015 12:19 AM
mega family,chiranjeevi,gunasekhar,rudhramadevi,brucelee  మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వదా..!
మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వదా..!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మొదటిరోజే సినిమా చూడాలనే ఆతురతను ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తారు. ప్రస్తుతం ఏ సినిమా ఆడుతున్నా.. స్టార్ హీరో సినిమా వస్తుందంటే చేసే హంగామానే వేరు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ ధోరణి మారింది. బాహుబలి సినిమా కోసం శ్రీమంతుడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసి తమ ఉదారభావాన్ని చాటుకున్నారు శ్రీమంతుడు  చిత్రబృందం. అలా కాకుండా బాహుబలికి పోటీ వస్తే చాలా నష్టాలు కలిగేవి. ఇప్పడు రుద్రమదేవి కి అదే కష్టం వచ్చి పడింది. అక్టోబర్ 9న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకెల్తుంది. అయితే ఈ నెల 16న బ్రూస్ లీ సినిమా రిలీజ్ చేయనున్నారని తెలిపారు. అనుకున్నట్లుగానే బ్రూస్ లీ రిలీజ్ అయితే రుద్రమదేవి కి నష్టాలు తప్పవు. గుణశేఖర్ ఎంతో ఖర్చు పెట్టి తీసిన ఈ చిత్రానికి బ్రూస్ లీ చిత్రం పోటీ రావడం మంచిది కాదని ఓ నిర్మాత చిరంజీవికి ఉత్తరం కూడా రాసారు. మరి దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి స్పందన లేదు. బ్రూస్ లీ సినిమా పోస్ట్ పోన్ అవుతుదని ఎలాంటి న్యూస్ రాలేదు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ