డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో రకుల్‌..!

Sat 10th Oct 2015 12:41 PM
rakul preet singh,sarainodu movie,allu arjun,boyapati srinu  డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో రకుల్‌..!
డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో రకుల్‌..!
Advertisement

ప్రస్తుతం అల్లుఅర్జున్‌ బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో సరైనోడు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ బేనర్‌పై అల్లుఅరవింద్‌ స్వయంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రంలో బన్నీ కోరమీసాలతో వెరైటీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ సీజన్‌లో రిలీజ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు. కాగా ఈచిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఇందులో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ను చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆమె రాజకీయనాయకురాలిగా అంటే ఎమ్మెల్యేగా కనిపించి అదరగొట్టనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రంలో రకుల్‌కు కథలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికిందని అంటున్నారు. 


Loading..
Loading..
Loading..
advertisement