Advertisementt

లేడీ డైరెక్టర్ తో రాజ్ తరుణ్..!

Thu 08th Oct 2015 03:28 AM
revathi,poorijagannath,raj tarun,uyyala jampala  లేడీ డైరెక్టర్ తో రాజ్ తరుణ్..!
లేడీ డైరెక్టర్ తో రాజ్ తరుణ్..!
Advertisement
Ads by CJ

ఉయ్యాల...జంపాల, సినిమా చూపిస్తమావా చిత్రాలతో వరుసగా రెండు హిట్లు తన ఖాతాలో వేసుకొన్న యువ హీరో రాజ్‌తరుణ్‌కు ఆఫర్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన సుకుమార్‌ నిర్మాణంలో రూపొందుతున్న కుమారి 21ఎఫ్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేశాడు. మరో సినిమా సెట్స్‌పై ఉంది. కాగా తాజాగా రాజ్‌తరుణ్‌కు మరో మంచి ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పూరీజగన్నాథ్‌, మెగాహీరో వరుణ్‌తేజ్‌ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇందులో టాలెంటెడ్‌ నటి రేవతి వరుణ్‌తేజ్‌కు తల్లిగా కీలకమైన పాత్రను పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో రేవతి పూరీజగన్నాథ్‌కు ఓ స్టోరీ వినిపించిందట. స్టోరీ నచ్చడంతో పూరీ సైతం తానే నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని, ఈ సినిమాను రేవతినే డైరెక్ట్‌ చేయమని కోరినట్లు సమాచారం. వాస్తవానికి రేవతికి డైరెక్షన్‌ కొత్తేమీ కాదు. ఆమె ఇప్పటివరకు ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించి కొన్ని చిత్రాలకు అవార్డులను కూడా అందుకొంది. కాగా ఈ చిత్రంలో యువ హీరో రాజ్‌తరుణ్‌ అయితే బాగుంటుందని పూరీ రేవతికి సూచించాడట. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి నిర్మించే యోచనలో పూరీ-రేవతి ఉన్నట్లు సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ