Advertisementt

నానికి జాక్‌పాట్‌..!

Thu 08th Oct 2015 03:01 AM
nani,ok bangaram,maniratnam,dulkar salman,nithyamenon  నానికి జాక్‌పాట్‌..!
నానికి జాక్‌పాట్‌..!
Advertisement
Ads by CJ

హీరో నాని భలే భలే మగాడివోయ్‌ చిత్రం తర్వాత స్టార్‌గా మారిపోయాడు. ఆయనకు మణిరత్నం గురువు. ఆయనపై ఉన్న అభిమానం, గౌరవంతోనే ఇటీవల మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఓకే బంగారం చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌ పాత్రకు డబ్బింగ్‌ కూడా చెప్పాడు. కాగా అనుకోని విధంగా నానికి మణిరత్నం వంటి క్రియేటివ్‌ జీనియస్‌ నుండి పిలుపు వచ్చింది. తాజాగా తాను కార్తీ -దుల్కర్‌సల్మాన్‌ల కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రం నుండి పిలుపు వచ్చింది. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ఉందని, దానిని పోషించాల్సిందిగా మణిరత్నం నానిని కోరాడట. తనకు గురువు, అందునా ఎవర్‌గ్రీన్‌ డైరెక్టర్‌ మణి నుండి ఆఫర్‌ అంటే ఎవరు మాత్రం వదులకుంటారు? అడిగిన వెంటనే నాని కూడా ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ఈ చిత్రం తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో రూపొందనుంది. మొత్తానికి తెలుగు వెర్షన్‌కు నాని ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడనే నమ్మకంతో మణిరత్నం ఉన్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ