Advertisement

శ్రీమంతుడును టార్గెట్‌ చేస్తున్నారు..!

Wed 07th Oct 2015 11:59 AM
sreemanthudu,bahubali,brucelee,nannaku prematho  శ్రీమంతుడును టార్గెట్‌ చేస్తున్నారు..!
శ్రీమంతుడును టార్గెట్‌ చేస్తున్నారు..!
Advertisement

ఇప్పుడు టాలీవుడ్‌లో నాన్‌ బాహుబలి పోటీ నడుస్తోంది. బాహుబలిని ఓ ప్రత్యేక చిత్రంగా భావించి దానిని పక్కనపెట్టి నాన్‌ బాహుబలి కోటాలో చరిత్రను తిరగరాసిన మహేష్‌బాబు శ్రీమంతుడునే అందరూ టార్గెట్‌ చేస్తున్నారు. మగధీర రికార్డులను అత్తారింటికి దారేది కొల్లగొట్టడం, ఇప్పుడు దానిని శ్రీమంతుడు కొల్లగొట్టడంతో ఇప్పుడు స్టార్స్‌ కళ్లు శ్రీమంతుడుపై పడ్డాయి. ఈ చిత్రానికి వచ్చిన 83కట్ల టార్గెట్‌ను మించి పోవాలని ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్‌ హీరో కృషి చేస్తున్నాడు. రామ్‌చరణ్‌ హీరోగా వస్తున్న బ్రూస్‌లీ చిత్రంతో శ్రీమంతుడును టార్గెట్‌ చేయాలని చూస్తున్నారు. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి కూడా చాలా కాలం తర్వాత మరలా రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ చిత్రం శ్రీమంతుడును దాటుతుందనే నమ్మకాన్ని మెగాభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న సర్దార్‌గబ్బర్‌సింగ్‌పై మెగాభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. అత్తారింటికి దారేది రికార్డులను శ్రీమంతుడు దాటేయడంతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ కొట్టి శ్రీమంతుడును దాటే చిత్రం తమ హీరోదే అవుతుందనే నమ్మకాన్నివారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పంపిణీహక్కులను ఈరోస్‌ సంస్థ 70కోట్లకు తీసుకోవడంతో ఈ సినిమాకి హిట్‌ టాక్‌ వస్తే 100కోట్లు పెద్ద విషయం కాదని అంటున్నారు. ఇక ఇప్పటివరకు 50కోట్ల క్లబ్‌లో స్థానం దక్కించుకోలేకపోయిన ఎన్టీఆర్‌కు సైతం ఆ దమ్ము ఉందని, ఆయనకున్న మాస్‌ ఇమేజ్‌కు ఒక్క భారీ హిట్‌ పడితే ఎన్టీఆర్‌కు కూడా శ్రీమంతుడుని దాటే సత్తా ఉందని, అది నాన్నకు ప్రేమతో చిత్రమే అవుతుందనే నమ్మకాన్ని నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుసగా రెండు సినిమాలతో 50కోట్ల క్లబ్‌లో చేరిన అల్లుఅర్జున్‌ బోయపాటిశ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కూడా తక్కువగా అంచనా వేయలేమని, ఈ చిత్రం హిట్టయితే శ్రీమంతుడుకి దరిదాపుల్లోకి వెళ్లడం బన్నీకి కూడా సాధ్యమే అని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement