Advertisementt

రెండు పడవలపై కుర్రహీరో..!

Tue 06th Oct 2015 03:06 PM
raj tarun,uyyala jampala,kumari 21f,ladies tailor2,sunil  రెండు పడవలపై కుర్రహీరో..!
రెండు పడవలపై కుర్రహీరో..!
Advertisement
Ads by CJ

రాజ్‌తరుణ్‌... ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ అనే వరుస రెండు హిట్‌ చిత్రాలలో నటించి తనకంటు ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన కుమారి 21ఎఫ్‌తో పాటు మరో సినిమా కూడా షూటింగ్‌ పూర్తికావచ్చింది. ఇక వంశీ డైరెక్షన్‌లో ఆయన నటించే లేడీస్‌ టైలర్‌ పార్ట్‌ 2 కమిట్‌ అయ్యాడు. ఈ మధ్యలో ఆయనకు కాస్త గ్యాప్‌ దొరకడంతో బ్యాంకాక్‌ వెళ్లాడు. అయితే అది విశ్రాంతి కోసమో, లేక రీఫ్రెష్‌ కావడం కోసమో కాదు...! బేసిక్‌గా రాజ్‌తరుణ్‌ స్టోరీ, డైలాగ్‌, స్క్రీన్‌ప్లే డిపార్ట్‌మెంట్‌ నుండి వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి తనకు హఠాత్తుగా వచ్చే ఐడియాలను స్టోరీలుగా మలచడం కోసం ఆయన బ్యాంకాక్‌ వెళ్లాడు. ఆయన తయారు చేసిన సబ్జెక్ట్స్‌లో ఒకటి హీరో సునీల్‌కు నప్పే కథ అని, రాజ్‌తరుణ్‌ కూడా సునీల్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడని సమాచారం. మొత్తానికి చిన్నగా హీరోగా డెవలప్‌ అవుతున్న మూమెంట్‌లో రాజ్‌తరుణ్‌ ఇలా రెండు పడవల ప్రయాణం ప్రమాదకరమని ఆయనకు తెలిసినట్లు లేదు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ