Advertisementt

బాహుబలి2కి భారీ ఆఫర్‌.. అయినా జక్కన్న నో..!

Tue 06th Oct 2015 03:52 AM
rajamouli,bahubali1,bahubali part2,600crores target  బాహుబలి2కి భారీ ఆఫర్‌.. అయినా జక్కన్న నో..!
బాహుబలి2కి భారీ ఆఫర్‌.. అయినా జక్కన్న నో..!
Advertisement
Ads by CJ

బాహుబలి1 చిత్రం దేశవాప్తంగా ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా ఈ చిత్రం దాదాపు 600కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. అందుకే ఇప్పుడు బాహుబలి2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. పార్ట్‌ కూడా కనీసం 600కోట్లను సాధిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అందుకే కొన్ని కార్పొరేట్‌ సంస్థలు ఈ సినిమా షూటింగ్‌ మొదలుకాకముందే అవుట్‌రేట్‌కు కొనేద్దామని ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. 500కోట్లకు బాహుబలి2ను అడగుతున్నారట. అయితే రాజమౌళి అండ్‌ టీమ్‌ మాత్రం బాహుబలి పార్ట్‌2ను అవుట్‌రేట్‌కు అమ్మడానికి సిద్దంగా లేదు. ఏరియాల వారిగా అమ్మితేనే ఎక్కువ లాభాలు వస్తాయని రాజమౌళి భావిస్తున్నాడట. ఇక రెండోభాగం షూటింగ్‌కు కావాల్సిన పెట్టుబడి ఫైనాన్షియర్స్‌ నుండి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని, ఏరియాల వారిగా పంపిణీదారులు ఇచ్చే అడ్వాన్స్‌లతోనే ఈ సినిమాను తెరకెక్కించే పరిస్థితి ఉందని అంటున్నారు. బాహుబలి పార్ట్‌2లో రాజమౌళి టార్గెట్‌ ఈసారి 600కోట్ల పై మాటే అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ