రుద్రమదేవిలో డోస్‌ పెంచారు..!

Sat 26th Sep 2015 02:31 AM
rudhramadevi,gunasekhar,anushka,rana,catherin  రుద్రమదేవిలో డోస్‌ పెంచారు..!
రుద్రమదేవిలో డోస్‌ పెంచారు..!
Advertisement
Ads by CJ

ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తున్న హిస్టారికల్‌ మూవీ రుద్రమదేవి. కాగా ఈ చిత్రం ఇప్పటికే చాలాసార్లు విడుదల వాయిదాపడింది. అయితే ఈ చిత్రం సెన్సార్‌ ఎప్పుడో పూర్తయింది. సెన్సార్‌బోర్డ్‌ ఈ చిత్రానికి మొదట క్లీన్‌ యు సర్టిఫికేట్‌ ఇచ్చింది. అయితే ఈ వాయిదా పడిన సమయంలో తొలికాపీలో ఎడిట్‌ చేసిన కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను, అనుష్క, రానాల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలను, కేథరిన్‌ చేసిన కొన్ని స్పైసీ సీన్స్‌ను తాజాగా సినిమా తొలికాపీకి కలిపి మరోసారి సెన్సార్‌కు తీసుకెళ్లారు. ఈసారి మాత్రం సెన్సార్‌బోర్ద్‌ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీంతో తొలికాపీకి మరింత శృంగారపు డోస్‌ పెంచడం వల్లే సెన్సార్‌బోర్డ్‌ ఈ రకమైన సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. చారిత్రక చిత్రాలలో నిజమైన కథకు కాస్త ఊహాజనిత కమర్షియల్‌ హంగులు అద్డడం మామూలే. అయితే అవి డోస్‌ మించితే మాత్రం తీవ్ర సమస్యను తెచ్చిపెడతాయి. మరి గుణశేఖర్‌ హద్దుల్లోనే తీశాడా? లేక రుద్రమదేవితో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడా? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ