Advertisementt

మంచు మనోజ్ కు మరో మాస్ టైటిల్..!

Thu 24th Sep 2015 05:18 AM
manchu manoj,attack movie,dasaradh,sowrya,sree  మంచు మనోజ్ కు మరో మాస్ టైటిల్..!
మంచు మనోజ్ కు మరో మాస్ టైటిల్..!
Advertisement
Ads by CJ

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్‌ నటిస్తున్న ఎటాక్‌ షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం బిజీలో ఉన్న మనోజ్‌ మరోవైపు ఫ్యామిలీచిత్రాల దర్శకుడిగా పేరున్న దశరథ్‌ దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలు ఎక్కించాడు. కుటుంబ కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని సమాచారం. మనోజ్‌ ఈ తరహా యాక్షన్‌ సీన్స్‌ను తనదైన శైలిలో ఆయనే స్వయంగా డిజైన్‌ చేసుకున్నాడట. కాగా ఈ చిత్రానికి శౌర్య అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. దశరథ్‌తో మనోజ్‌కి ఇది రెండో చిత్రం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శ్రీ చిత్రం అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. మరి దశరథ్‌ తన శౌర్యతో అయినా మనోజ్‌ లెక్కను సరిచేస్తాడా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది....! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ