ప్రియమణిని బన్నీ అలా వాడేస్తున్నాడు!

Wed 23rd Sep 2015 01:56 AM
allu arjun,boyapati sreenu,priyamani,sarainodu movie  ప్రియమణిని బన్నీ అలా వాడేస్తున్నాడు!
ప్రియమణిని బన్నీ అలా వాడేస్తున్నాడు!
Advertisement

ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పెళ్ళైన కొత్తలో సినిమాతో హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న నటి ప్రియమణి. తెలుగులో చాలా చిత్రాల్లో నటించినప్పటికీ యమదొంగ చిత్రం తప్ప తన కెరీర్ లో మరో చెప్పుకోదగ్గ హిట్టు సినిమా లేదు. ప్రస్తుతం ఈ భామకు తెలుగులో ఎలాంటి అవకాశాలు లేవు. ఇంక ప్రియమణి సీన్ అయిపోయింది అనుకున్న టైంలో బాలీవుడ్ లో షారుఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించే చాన్స్ కొట్టేసింది. తాజాగా ప్రియమణి తెలుగులో కూడా ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుందని సమాచారం. బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు చిత్రంలో ఐటెం సాంగ్ కోసం ప్రియమణిని అనుకుంటునట్లు తెలుస్తోంది. దాదాపుగా ప్రియమణినే కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో ఈ అమ్మడు చాలా సంతోషంగా ఉందంట.


Loading..
Loading..
Loading..
advertisement